Minister Nara Lokesh Attends Son’s PTM | ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్-బ్రాహ్మణి దంపతులు కుమారుడు దేవాన్ష్ చడివుతున్న పాఠశాలలో జరిగిన పేరెంట్స్-టీచర్ మీటింగ్ హాజరయ్యారు.
ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. ఈ మీటింగ్ కు హాజరయ్యేందుకు ఒక రోజు సెలవు తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ బిజీగా ఉంటారని, దింతో ఇలాంటి క్షణాలు చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయని చెప్పారు. దేవాన్ష్ యొక్క చిన్న ప్రపంచం, చెప్పే ముచ్చట్లు మరియు అతని చిరునవ్వు తనకు ఎనలేని సంతోషాన్ని ఇస్తుందని లోకేశ్ తెలిపారు. దేవాన్ష్ ను చూసి గర్వ పడుతున్నట్లు పేర్కొన్నారు.









