Minister Komatireddy News | నల్గొండ ( Nalgonda ) జిల్లా కనగల్ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఈ సమయంలో స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ టీచర్లు, విద్యార్ధులు తమ పాఠశాలను సందర్శించాలని మంత్రిని కోరారు. ఈ క్రమంలో స్కూళ్లో బాత్ రూమ్స్ ( Bathrooms ) లేక విద్యార్ధినులు ఇబ్బందిపడుతున్నారని అలాగే విద్యుత్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో విద్యార్ధులకు ఇబ్బందులు కలగకూడదని వెంటనే బాత్ రూంల నిర్మాణం, విద్యుత్ కనెక్షన్ సమస్య పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
అంతేకాకుండా విద్యార్ధులకు బాస్కెట్ బాల్, వాలీబాల్, క్యారమ్స్ ( Carrom ) వంటి ఆట వస్తువులను 4 ఇన్వర్టర్లను అందించడంతో పాటు, విద్యార్ధులందరికి సరిపడేలా వాటర్ ప్లాంట్ ను ప్రతీక్ ఫౌండేషన్ నుంచి ఏర్పాటు చేయబడుతుందని హామీ ఇచ్చారు.
ఒకవేళ విద్యార్థులు మెడికల్, ఐఐటీ సీట్లను సాధిస్తే ఆర్థికంగా సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. ప్రైవేట్ స్కూల్స్ లో కంటే ప్రభుత్వ పాఠశాలాల్లోనే అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉంటారని పేర్కొన్నారు.