Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > హత్యా రాజకీయాలు చేయడమేనా మీ గ్రాఫ్ కేసీఆర్?

హత్యా రాజకీయాలు చేయడమేనా మీ గ్రాఫ్ కేసీఆర్?

komatireddy venkat reddy
  • రాజలింగ మూర్తి హత్యను ఖండించిన మంత్రి కోమటిరెడ్డి
  • ఈ దారుణంలో కేసీఆర్, కేటీఆర్ హరీశ్, గండ్ర వెంకటరమణారెడ్డి పాత్ర ఉంది
  • ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది
  • సీబీ సీఐడీ విచారణతో నిందితులను పట్టుకుంటాం

Minister Komatireddy Venkat Reddy | కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (Medigadda) ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కేసు పెట్టిన రాజలింగ మూర్తి (Rajalinga Murthy) హత్యను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తీవ్రంగా ఖండించారు.

గురువారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ టీఆరెస్ పడేండ్లలో హత్యా రాజకీయాన్ని పెంచి పోషించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించిన రాజలింగాన్ని హత్య చేశారని సంచలన ఆరోపణలు చేశారు.

“కాళేశ్వరం ప్రాజెక్టు లో కేసీఆర్ తో పాటు ఐదుగురిపై సామాజిక కార్యకర్త రాజలింగం కోర్టులో కేసు వేశాడు. అతన్ని గండ్ర వెంకటరమణారెడ్డి హత్య చేయించాడు. కాళేశ్వరంలో కేసీఆర్ కు దోషిగా శిక్ష పడుతుందని కేసీఆర్, కేటిఆర్ లు హత్య చేయించారని రాజలింగమూర్తి కూతురు,భార్య చెప్తుంది. అడ్వకేట్ వామన రావు ఆయన భార్య హత్యకు ఎవరు కారణమో అందరికి తెలుసు.

వరంగల్ లో ఎంపీడీఓ ను బీఆర్ఎస్ వాళ్ళు హత్య చేశారని అప్పటి సిపి రంగనాథ్ చెప్పారు. కొడంగల్ లో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పై కూడా సురేష్ అనే రౌడీ షీటర్ దాడి చేశారు. బీఆర్ఎస్ లక్ష్యం ఒక్కటే. తెలంగాణలో అభివృద్ధి జరగొద్దు అనేది.

కేసీఆర్ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని అంటుండు. హత్యా రాజకీయాలు చేయడమేనా మీ గ్రాఫ్ కేసీఆర్? కిరాయి హత్యలు చేయించడమే తప్ప కేసీఆర్ తో ఏమి కాదు. 15 నెలల నుండి ఫాం హౌస్ నుండి ఎప్పుడైనా బయటకి వచ్చిండా?

రాజలింగమూర్తి హత్య ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్న. హత్య లో కేసీఆర్, కేటిఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరమణ రెడ్డి పాత్ర ఉంది. సీబీ సీఐడీ విచారణ చేసి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయాలి. పాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి వెంటనే శిక్ష వేయాలి.

హత్యను సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా తీసుకుంటారు. లగచర్లలో లో కూడా కలెక్టర్ ను చంపాలని చూసిండ్రు. తెలంగాణలో హత్య రాజకీయాలకు తావు లేదు. అవినీతి మీద పోరాడే వారికి రక్షణ కల్పిస్తాం. హరీష్ రావు అవినీతి మీద పోరాడుతున్న చక్రధర్ కూడా రక్షణ కల్పిస్తాం.

తెలంగాణ ను దోచుకొని తిని ఎదురు తిరిగిన వాళ్ళను చంపేస్తారా? పాపం తగిలి పోతరు” అని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

You may also like
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
police as mother
ఖాకీ దుస్తుల కాఠిన్యం వెనక కరిగిన అమ్మ మనసు.. వీడియో వైరల్!
harish rao pressemeet
రైతుల నోట్లో మట్టి కొట్టి.. బీరు ఫ్యాక్టరీలకు నీళ్లిస్తారా?
ajit and sharad powar
అజిత్ పవార్ మృతిపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions