Minister Komatireddy News | అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం జరగనున్న తెలంగాణ రోడ్లు దేశానికే రోల్ మోడల్‌గా నిలవబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాక్సిడెంట్-ఫ్రీ రోడ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు.
ఈ మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు మంత్రి కోమటిరెడ్డి హ్యామ్ రోడ్ల నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సమ ప్రాధాన్యత ఉండేలా ఫేజ్‌ల వారీగా హ్యామ్ రోడ్ల నిర్మాణం ఉంటుందన్నారు.
మొదటి దశలో రూ.10,986 కోట్ల వ్యయంతో 5,587 కి.మీ మేరకు హ్యామ్ రోడ్ల నిర్మాణానికి వచ్చే నెలల్లోనే టెండర్లు పిలవనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లు, జిల్లా కేంద్రాల నుండి రాష్ట్ర రాజధానికి ఫోర్ లేన్ రోడ్లు వేయనున్నట్లు తెలిపారు.









