‘Marwari Go Back’ campaign gains momentum in Telangana | మార్వాడీ గో బ్యాక్ అనే నినాదం తెలంగాణలో వైరల్ గా మారింది.
ఇదే సమయంలో రంగారెడ్డి జిల్లా అమనగల్లులోని వ్యాపారస్తులు మార్వాడీ గో బ్యాక్ అనే అంశంపై సోమవారం బంద్ ను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. తమ ప్రాంతంలో మార్వాడీలు దినదినాభివృద్ధి చెందుతూ అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ నాణ్యత లేని, నాసిరకం వస్తువులను అమ్ముతూ స్థానిక వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని అమనగల్లు వ్యాపారులు ఆరోపణలు చేస్తున్నారు.
మార్వాడీలు తమ దుకాణాల్లో, వ్యాపారాల్లో వారి మనుషులనే పనికి పెట్టుకోవడంతో స్థానికులకు ఉపాధి లేకుండా పోతుందని, ఇది ఇలాగే కొనసాగితే ప్రాంత ప్రజల మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అమనగల్లు వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇది హిందూ ప్రజలను విభజించే కుట్ర అని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.









