Tuesday 17th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి మీకే అంకితం’

‘డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి మీకే అంకితం’

Maria Corina Machado dedicates Nobel Peace Prize to Donald Trump | వెనుజువెల ప్రతిపక్ష నాయకురాలు మరియా కోరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి దక్కిన విషయం తెల్సిందే. ఈ మేరకు నార్వే నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటన చేసింది. వెనుజువెల దేశంలో ప్రజల హక్కుల కోసం, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వాయం కోసం శాంతి మార్గాన మరియా చేసిన పోరాటం ఫలితంగా ఈ బహుమతి దక్కింది.

అయితే ఈ బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు నిరాశే ఎదురైంది. ఇదే సమయంలో తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతిని వెనుజువెల ప్రజలకు, డోనాల్డ్ ట్రంప్ కు అంకితం చేస్తున్నట్లు మరియా ప్రకటించడం ఆసక్తిగా మారింది. వెనుజువెల దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా తాము సాగిస్తున్న పోరాటంలో ట్రంప్ ఎంతగానో సహకరిస్తున్నారని మరియా పేర్కొన్నారు. అనంతరం డోనాల్డ్ ట్రంప్ తో ఆమె ఫోన్లో మాట్లాడారు.

ఈ సందర్భంగా తాను మరియాకు నోబెల్ బహుమతి రావడం పట్ల అభినందనలు తెలియజేసినట్లు ట్రంప్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ బహుమతికి ఆమె పూర్తి అర్హులన్నారు. భవిష్యత్ లో ఆమెకు మరింత మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇదే సమయంలో నోబెల్ కమిటీపై మరోసారి ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్దాలను ఆపిన తన కృషిని గుర్తించపోవడం ఏంటని ప్రశ్నించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఏమీ చేయకున్నా నోబెల్ బహుమతి ఇచ్చారని తనకు మాత్రం తగిన గుర్తింపు ఇవ్వలేదని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions