High Drama in Manipur | గతకొద్దిరోజులుగా అల్లర్లు చెలరేగుతున్న మణిపూర్ లో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు బాధ్యత వహిస్తూ బీరెన్ సింగ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
రిజర్వేషన్ల విషయంలో మైతేయ్, కుకీల మధ్య కొద్ది రోజుల కిందట వైరం మొదలయ్యింది.
ఈ క్రమంలో మే 3వ తేదీన జరిగిన గిరిజన సంగీభావ ర్యాలీ హింసాత్మకంగా మారడం మాణిపూర్ అల్లర్లకు దారి తీసింది.
సుమారు 50 రోజుల నుండి మణిపూర్ లో పరస్పర ఘర్షణలు శాంతించడం లేదు. నేతల ఇళ్లకు నిప్పంటించడం, మూకదాడులు వంటివి జరుగుతున్నాయి.
ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 120 మందికి పైగా మరణించారు. పరిస్థితిని అదుపు చెయ్యడానికి ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించి, వేల మంది సైన్యం, ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన కేంద్రం పలు కమిటీలను వేసి పరిస్థితిని అదుపు చెయ్యడానికి ప్రయత్నం చేస్తోంది.
మరోవైపు మణిపూర్ లో ఈ అస్థిరతకు సీఎం బీరెన్ సింగ్ ప్రభుత్వ వైఫల్యమే కారణం అనే విమర్శులు వ్యక్తమవుతున్నాయి.
దీంతో బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు. కేంద్రం కూడా ఆయనను తప్పుకోమని సూచించినట్లు వార్తలు వచ్చాయి.
ఇంపాల్ లో హైడ్రామా..
ఈ తరుణం లో సీఎం బిరెన్ సింగ్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తన రాజీనామా పత్రాన్ని మణిపూర్ గవర్నర్ అనసూయ ఉకియ్ కు సమర్పించనున్నట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో బిరెన్ సింగ్ మద్దతుదారులు ముఖ్యంగా మహిళలు సీఎం రాజీనామా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
భారీ సంఖ్యలో బిరెన్ సింగ్ మద్దతుదారుకు సీఎం అధికార నివాసానికి చేరుకున్నారు.
రాష్ట్రంలో అస్థిరత ఎక్కువగా ఉన్నదని ఇలాంటి సమయంలో రాజీనామా చెయ్యకూడదని వారు వాదించారు.
గవర్నర్ ను కలవడానికి బయలుదేరిన బీరెన్ సింగ్ వాహనాన్ని తన మద్దతుదారులు ముట్టడించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చెయ్యకూడదని వారు కోరారు. తన మద్దతుదారులకు అభివాదం చేసిన సీఎం తిరిగి లోనికి వెళ్లిపోయారు.
మద్దతుదారులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్టు స్పష్టంచేశారు. అలాగే రాజీనామా పత్రాన్ని చింపివేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.