Manchu Family Row | సినీ నటుడు మంచు మోహన్ బాబు (Actor Mohan Babu) ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతోంది అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఆదివారం మంచు ఫ్యామిలీ వివాదం తారాస్థాయికి చేరుకుంది.
మొదట మోహన్ బాబు, ఆయన తనయుడు మనోజ్ ఒకరిపైఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. కానీ ఇందులో వాస్తవం లేదని మోహన్ బాబు టీం స్పష్టం చేసింది. ఇంతలోనే గాయాలతో మనోజ్ (Manchu Manoj) హాస్పిటల్ లో చేరడం సంచలనంగా మారింది.
మరోవైపు సోమవారం హైదరాబాద్ జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటికి భారీ సంఖ్యలో బౌన్సర్లు చేరుకున్నారు. పెద్ద కుమారుడు మంచు విష్ణు (Manchu Vishnu) తరఫున 40 మంది బౌన్సర్లు మోహన్ బాబు ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
దింతో మనోజ్ తరఫు మరో 30 మంది బౌన్సర్లు వచ్చారని, కానీ వారిని లోనికి అనుమతించలేదని కథనాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా మంచు విష్ణు దుబాయ్ నుండి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. ఆయన వచ్చాక ఈ వివాదం ఏ స్థాయికి వెళ్తుందో అనేది చర్చనీయాంశంగా మారింది.