Special Seats For Men | తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద ఆర్టీసీ (TSRTC) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి మహిళలు మొగ్గు చూపుతున్నారు. దీంతో బస్సుల్లో సీట్లు దొరక్క పురుషులు ఇబ్బందులు పడుతున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో పురుషుల కోసం ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఒక యువకుడు నిరసన చేపట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం లో జరిగింది.
Read Also: గొప్ప మనసు చాటుకున్న యువ మహిళా ఎంపీ!
రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సులకు అడ్డుగా నిల్చొని మహిళలకు ఉచిత ప్రయాణం మంచి ఆలోచనే అని కానీ, 30 సీట్లు ఉండే బస్సుల్లో కనీసం 10 సీట్లయినా కేటాయించాలని డిమాండ్ చేశాడు.
యువకుడి నిరసన తో కొద్దిసేపు రహదారి పై వాహనాలు నిలిచిపోయాయి. ఆ యువకుడి డిమాండ్ సరైనదేనని నెటిజన్లు తమ మద్దతు ప్రకటిస్తున్నారు.