Man Opens Fire At Sukhbir Singh Badal In Golden Temple | పంజాబ్ ( Punjab ) మాజీ ఉప ముఖ్యమంత్రిపై కాల్పులు జరగడం కలకలం రేపుతోంది.
2007 నుండి 2017 మధ్య శిరోమణి అకాలి దళ్ ( Shiromani Akali Dal ) అధికారంలో ఉన్న సమయంలో మతపరమైన తప్పిదాలు జరిగినట్లు అకాలి తఖ్త్ నిర్దారించింది. ఇందులో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలి దళ్ అధ్యక్షుడు సుఖబీర్ సింగ్ బాదల్ ( Sukhbir Singh Badal ) కు శిక్ష విధించారు.
ఈ నేపథ్యంలో అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం ( Golden Temple )లో సుఖబీర్ సింగ్ శిక్షను అనుభవించారు. ద్వారం వద్ద వీల్ చైర్ ( Wheelchair ) లో కూర్చున్న సుఖబీర్ పై ఓ వ్యక్తి కాల్పులు జరిపేందుకు యత్నించాడు.
సుఖబీర్ కు దగ్గరగా వచ్చిన ఓ వృద్ధుడు జోబులో నుండి తుపాకీ బయటకు తీసి కాల్చబోయాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది సదరు వ్యక్తిని పక్కకు లాక్కెళ్లారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
కాల్పులు జరిపిన నిందితుడ్ని నరైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. గతంలో అతడు బబ్బర్ ఖల్సా అనే ఉగ్రముఠాలో పనిచేసినట్లు తెలుస్తోంది. కాగా కాల్పుల ఘటనలో సుఖబీర్ సింగ్ సురక్షితంగా బయటపడ్డారు.









