Mallareddy-Vivek’s Interesting Conversation In Assembly | తెలంగాణ శాసనసభ లాబీలో మాజీ మంత్రి, బీఆరెస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.
లాబీలో ఎదురుపడ్డ వివేక్ ను నమస్తే మంత్రిగారు అంటూ మల్లారెడ్డి పలకరించారు. దింతో ధన్యవాదాలు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ బదులిచ్చారు.
మొత్తానికి సాధించారు..సీఎం, డిప్యూటీ సీఎం కంటే ముందే ఢిల్లీ వెళ్లిచ్చారు అని మల్లారెడ్డి అనగా, వేరే పనిమీద ఢిల్లీ వెళ్లినట్లు వివేక్ సమాధానం చెప్పారు. రాష్ట్రంలో కోమటిరెడ్డి, వెంకటస్వామి కుటుంబాలదే హవా నడుస్తోందని మల్లారెడ్డి అన్నారు.
దీనిపై గతంలో కేసీఆర్,మల్లారెడ్డి కుటుంబాలదే హవా నడిచేది అని కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మాదేం లేదు అని మల్లారెడ్డి చెప్పగా ఇరువురు నేతలు నవ్వుతూ వెళ్లిపోయారు.