Friday 6th March 2026
12:07:03 PM
Home > ఆరోగ్యం > మల్లారెడ్డి యూనివర్సిటీలో ‘అలైడ్ అండ్ హెల్త్‌ కేర్ ఇండస్ట్రీ సమ్మిట్’

మల్లారెడ్డి యూనివర్సిటీలో ‘అలైడ్ అండ్ హెల్త్‌ కేర్ ఇండస్ట్రీ సమ్మిట్’

సదస్సులో మాట్లాడుతున్న మల్లారెడ్డి

  • పాల్గొన్న జాతీయ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు
  • అపోలో, కిమ్స్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో విద్యార్థులు ముఖాముఖి
  • గ్లోబల్ హెల్త్‌ కేర్ మార్కెట్‌లో విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యం

Allied & Healthcare Industry Summit | వైద్య విద్య మరియు ఆరోగ్య సంరక్షణ పరిశ్రమల మధ్య సమన్వయాన్ని పెంపొందించే లక్ష్యంతో హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శుక్రవారం ‘అలైడ్ అండ్ హెల్త్‌ కేర్ ఇండస్ట్రీ సమ్మిట్’ ఘనంగా జరిగింది.

హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు, అకడమిక్ రంగానికి మరియు పారిశ్రామిక అవసరాలకు మధ్య ఒక బలమైన వారధిగా నిలిచింది.

ఈ ప్రతిష్టాత్మక సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు, వ్యాక్సిన్ తయారీ కేంద్రాలు, మరియు డయాగ్నస్టిక్ ల్యాబ్‌లకు చెందిన ప్రతినిధులతో పాటు 40కి పైగా జాతీయ, అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ సంస్థలు పాల్గొన్నాయి.

ముఖ్యంగా అపోలో హాస్పిటల్స్, కిమ్స్, మెడికవర్, సిటిజన్ హాస్పిటల్స్, మరియు జైస్ వంటి అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులు హాజరై విద్యార్థులతో ముఖాముఖి చర్చలు జరిపారు.

మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవస్థాపక చైర్మన్ చామకూర మల్లారెడ్డి ప్రోత్సాహంతో జరిగిన ఈ కార్యక్రమంలో తరగతి గది అభ్యాసాన్ని వాస్తవ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్చడం, అలైడ్ హెల్త్‌ కేర్ టెక్నాలజీలో వస్తున్న మార్పులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మారుతున్న ఆరోగ్య రంగ అవసరాలకు తగ్గట్టుగా హెల్త్‌ కేర్ వర్కర్స్ ఫోర్స్ సిద్ధం చేయడం వంటి అంశాలపై నిపుణులు చర్చించారు.

సదస్సులో మాట్లాడుతున్న ప్రీతిరెడ్డి

భవిష్యత్ అవకాశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులను అంతర్జాతీయ హెల్త్‌ కేర్ మార్కెట్‌కు సిద్ధం చేయడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. సదస్సు ముగింపులో విద్యార్థులకు వివిధ సంస్థలలో ఇంటర్న్‌ షిప్ మరియు ప్లేస్‌మెంట్ అవకాశాలను కల్పించడంపై స్పష్టమైన హామీ లభించింది.

సదస్సుకు హజరైన ప్రతినిధులు, విద్యార్థులు

ఈ కార్యక్రమాన్ని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్ సీ.హెచ్. ప్రీతిరెడ్డి, వైస్ ఛాన్సలర్ డాక్టర్ వీ.ఎస్.కె. రెడ్డి, డీన్స్ డాక్టర్ ఎస్. అపర్ణ, డాక్టర్ ఎం. సుజీర్ బాషా అధికారులు సమన్వయం చేశారు. ఈ సదస్సుకు కేబీకే గ్రూప్ చైర్మన్, మెధాజెన్ ఏఐ సీఈవో డాక్టర్ కక్కిరేణి భరత్ కుమార్ కూడా హాజరయ్యారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions