Malavika Mohanan Updates | నటి మాళవిక మోహనన్ గతంలో తనకు ఎదురైన ఓ భయంకర చేదు అనుభవం గురించి ఇటీవల చెప్పారు. ముంబయి లోకల్ ట్రెయిన్ లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ప్రవర్తన తనను భయాందోళనకు గురి చేసిందన్నారు.
ముంబయిలో ఒక రోజు రాత్రి స్నేహితులతో కలిసి లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్నట్లు, ఆ సమయంలో ఆ కాంపార్టుమెంట్ లో ఎవరూ లేరని తెలిపారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి కాంపార్టుమెంట్ లోకి రావడానికి ప్రయత్నించాడని, గ్లాసు డోర్ వద్ద నిల్చొని ముద్దిస్తావ అంటూ సైగలు చేసినట్లు పేర్కొన్నారు.
అతడి ప్రవర్తన మూలంగా తనతో పాటు ఇతర స్నేహితులు ఎంతో భయపడినట్లు చెప్పారు. 10 నిమిషాల తర్వాత వేరే స్టేషన్ రాగానే ఇతర ప్రయాణికులు తమతో కలవడంతో ఊపిరి పీల్చుకున్నట్లు మాళవికా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.