Kurchi Madathapetti Song News | సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ), శ్రీలీల ( Sreeleela ) జంటగా త్రివిక్రమ్ ( Trivikram ) తెరకెక్కించిన మూవీ ‘గుంటూరు కారం’.
ఈ మూవీలోని ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాట ఎంతటి సెన్సేషన్ ను క్రీయేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజగా ఈ పాట ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. తమ ప్లాట్ఫార్మ్ ( Platform ) లో 2024 సంవత్సరానికి గాను టాప్ గా నిలిచిన పాటల జాబితాను యూట్యూబ్ రిలీజ్ చేసింది.
ఏయే దేశాల నుండి ఏ పాట టాప్ లో నిలిచిందో పేర్కొంది. ఇందులో ఇండియా నుంచి ఈ లిస్టు చోటుసంపాదించుకున్న ఏకైక పాట ‘ కుర్చీ మడతపెట్టి ‘. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ వంటి భాషల్లో ఈ ఏడాది అనేక పాటలు విడుదలయ్యాయి.
అయితే వీటన్నింటినీ వెనక్కు నెట్టి మహేష్ బాబు, శ్రీలీల స్టెప్పులేసిన కుర్చీ మడతపెట్టి పాట అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ( SS Thaman ) సంతోషం వ్యక్తం చేశారు. గుంటూర్ కారం టీం అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు.
చిత్ర బృందంతో పాటు పాటను ఆదరించిన ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. కాగా కుర్చీ మడతపెట్టి పాట ఇప్పటివరకు యూట్యూబ్ లో 526 మిలియన్లు ( Millions ) అంటే 52 కోట్లపైనే వ్యూస్ ( Views ) ను సొంతం చేసుకుంది.









