Kumbh Mela 2025 News | ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ ( Prayagraj ) కుంభమేళాకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు.
12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాను ప్రపంచస్థాయి ఉత్సవంలా నిర్వహించాలని యోగి సర్కార్ భావిస్తుంది. ఈ క్రమంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే కుంభమేళా ఆరంభ, ముగింపు దినాల్లో డ్రోన్ల ( Drones ) ద్వారా ప్రదర్శన ఉండనుంది.
ఆకాశంలో ఎగిరే డ్రోన్లు మహా కుంభ్, ప్రయాగ మహత్యం కథలతో భక్తులను కనువిందు చేయనున్నాయి. సాగర మథనం, అమృత కలశ అవిర్భావాలను కళ్ళకు కడతాయని అధికారులు పేర్కొన్నారు. మహా కుంభమేళాను ఐక్యతా మేళాగా ప్రధాని మోదీ ( Pm Modi ) అభివర్ణించారు.
భక్తుల భద్రత కోసం 50 వేల మంది సిబ్బంది, 2700 ఏఐ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే తొలిసారి అండర్ వాటర్ ( Under Water ) డ్రోన్లను వినియోగించనున్నారు. అంతేకాకుండా కుంభమేళా సమాచారం తెలుసుకునేందుకు 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్ బాట్ ను అందుబాటులోకి అధికారులు తీసుకురానున్నారు.
ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 కోట్లమంది హాజరువుతారని అంచనా ఉంది.