KTR’s son Himanshu watched Kingdom | విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా ‘కింగ్డమ్’. ఈ మూవీ గురువారం విడుదల అయిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు తన స్నేహితులతో కలిసి కింగ్డమ్ మూవీ చూశాడు. అనంతరం సినిమా అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓ థియేటర్ లో కింగ్డమ్ మూవీని చూసినట్లు హిమాన్షు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.
ఒక థియేటర్ లో మంచి అనుభూతి పొందడం తనకు ఇదే తొలిసారి అని పేర్కొన్నాడు. థియేటర్ వాతావరణం గూస్ బంప్స్ తెప్పించాయని, అలాగే విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించారని పోస్టులో హిమాన్షు తెలిపాడు. సినిమా తనకు బాగా నచ్చిందన్నాడు. ఈ నేపథ్యంలో హిమాన్షు పోస్టుపై విజయ్ దేవరకొండ స్పందించారు. లవ్ ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు.









