KTR Tweet On BRS Lost | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆరెస్ (BRS Party) ఘోర పరాజయం చవిచూసింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగింది. దాదాపు 65 స్థానాల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో బీఆరెస్ పార్టీ ఓటమిపై కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ కు వరసగా రెండుసార్లు విజయాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈరోజు ఫలితం గురించి బాధపడటం లేదన్నారు. కానీ ఫలితాలు తమకు వ్యతిరేకంగా రావడం నిరాశ కలిగించిందన్నారు.
ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని గ్రహించాననీ, దీన్ని గుణపాఠంగా తీసుకొని మళ్ళీ పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి మా శుభాభినందనలు తెలిపారు కేటీఆర్.










