KTR Slams Congress Men | తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ తెచ్చిన నాయకుడైన కేసీఆర్ గారిని ఏక వచనంతో సంభోదించడం సరికాదని రేవంత్ రెడ్డికి సూచించారు కేటీఆర్.
అలాగే ముఖ్యమంత్రి అయిన తర్వాతైనా రేవంత్ రెడ్డి మర్యాదగా మాట్లాడతారని అనుకున్నాం, కానీ కొన్నింటిని మనం ఊహించలేం అంటూ, కొంతమందికి అది సాధ్యం కూడా కాదని తేల్చి చెప్పారు కేటీఆర్.
మరోవైపు తెలంగాణను వ్యతిరేకించిన నాయకులను మాత్రం గారు అని సంభోదిస్తున్నారని, దీన్ని బట్టే రేవంత్ రెడ్డి సంస్కారం, పరిజ్ఞానం అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు కేటీఆర్. అచ్చోసిన ఆంబోతు, చీమలు పెట్టిన పుట్టలోకి పాములు అంటూ సీఎం మాట్లాడుతున్నారు.
Read Also: నా వల్ల ప్రజలకు ఇబ్బంది కలగొద్దు.. సీఎం సంచలన నిర్ణయం!
అస్సలు భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ లాంటి వారు నడిపిస్తున్న పార్టీలోకి వచ్చి చేరిందే రేవంత్ అంటూ వ్యాఖ్యానించారు. పరాయి పాలనను తరిమి కొట్టిన తాము ఢిల్లీ నుండో, కర్ణాటక నుండో రిమోట్ కంట్రోల్ ద్వారా పాలన చేస్తామంటే ప్రతిపక్షంగా సహించబోమని స్పష్టం చేశారు కేటీఆర్.