Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > పరువునష్టం నోటీసులపై స్పందించిన కేటీఆర్!|

పరువునష్టం నోటీసులపై స్పందించిన కేటీఆర్!|

ktr pressmeet

Ktr Responce On Defamation Notice| పీసీసీ ( PCC ) పదవికి రూ. 50 కోట్లు ( Rs. 50 Cr. ) అనే వ్యాఖ్యలు చేసినందుకు గానూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ( Working President ) కేటీఆర్ ( Ktr ) కు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ ( Incharge ) మాణికం ఠాకూర్ ( Manickam Tagore ) పరువు నష్టం నోటీసులు పంపారు.

ఈ నేపథ్యంలో తనకు వచ్చిన నోటీసుల ( Notice )పై స్పందించారు కేటీఆర్. ఎక్స్ ( Formerly Twitter ) వేదికగా స్పందించిన కేటీఆర్ మాణిక్కం ఠాకూర్ అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

“మాణికం ఠాకూర్ గారూ.. మీ తోటి కాంగ్రెస్ ( Congress ) నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkatreddy ) బహిరంగంగానే రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) మీకు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి పదవి కొనుక్కున్నారని ఆరోపించారు. పెద్ద ఎత్తున మీడియా ( Media )లో వచ్చిన ఈ రూ. 50 కోట్ల లంచం ( Bribe ) వార్తలనే నేనూ ప్రస్తావించాను.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ పై చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదు. కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. మీరు పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుంది. నా చిరునామా ( Address ) కు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించండి” అని పేర్కొన్నారు కేటీఆర్.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’
KTR press meet
‘ఆరు గ్యారెంటీ ల కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం’
engineering fee in tg
రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు.. అత్యధికం ఎంతంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions