Sunday 22nd December 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ఇలాంటి ఘటనలు మీ కుటుంబలో జరిగితే.. రాహుల్ జీ!!’

‘ఇలాంటి ఘటనలు మీ కుటుంబలో జరిగితే.. రాహుల్ జీ!!’

ktr comments

KTR Tags Rahul Gandhi | హైదరాబాద్ పరిధిలోని కేపీహెచ్బీ కాలనీలో ఫుట్ పాత్ పై నెలకొల్పిన షాపులను అధికారులు ఇటీవల తొలగించారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారని షాపుల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొంత మంది మహిళలు మాత్రం షాపుల్లోనే ఉండి నిరసన వ్యక్తం చేస్తుంటే కూడా కూల్చివేతలు మాత్రం ఆపలేదు. ఈ కూల్చివేతలపై శనివారం ఎక్స్ వేదికగా (KTR) కేటీఆర్ స్పందించారు. కూల్చి వేతలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ని ప్రశ్శించారు.

ఇలాంటి ఘటనలు మీ కుటుంబంలో జరిగితే, అంగీకరించగలరా? రాహుల్ గాంధీ జీ అని నిలదీశారు. పట్టింపు, మానవత్వం లేని ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడుతాయని పోస్ట్ చేశారు.

తెలంగాణలో ఇంట్లో ఇద్దరు మహిళలు ఉండగానే.. బుల్డోజర్లతో ఆ ఇండ్లను కూలగొట్టారని, మరి వారి భద్రతకు ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పేదలకు ప్రేమ పంచుతాం అనడం అంటే ఇదేనేమో అని రాహుల్ గాంధీకి కేటీఆర్ ట్యాగ్ చేశారు.

You may also like
అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్తారా ?
మహిళ చనిపోయిందంటే సినిమా హిట్ అని అల్లు అర్జున్ నవ్వాడు
ఇక బెనిఫిట్ షోలు, టికెట్ రేట్స్ ఉండవు..సినీ స్టార్లకు రేవంత్ వార్నింగ్
జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions