KTR Post On Formula E Car Race Case | అబద్ధాలు తనను దెబ్బతీయలేవని, ఆరోపణలు తనను తగ్గించలేవని బీఆరెస్ ( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ ( X ) వేదికగా ఒక పోస్ట్ చేశారు. నా మాటలు రాసిపెట్టుకోండి..ఈ ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటామని పేర్కొన్నారు.
‘ మీ చర్యలు నా గమ్యాన్ని మార్చలేవు.. కుట్రలతో నోరు మూయించలేరు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారి తీస్తాయి. న్యాయవ్యవస్థపై గౌరవం ఉంది.. న్యాయమే గెలుస్తుందని అచంచలమైన నమ్మకం ఉంది. సత్యం కోసం పోరాటం కొనసాగుతుంది నా పోరాటానికి ఈ ప్రపంచమే సాక్షిగా నిలుస్తుంది’ అని కేటీఆర్ పోస్ట్ చేశారు.
కాగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ( Quash Petition ) ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.