KTR News Latest | ముడుపుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతీ కంపెనీని వేధిస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఈ మేరకు బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. సీఎం పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదని ముడుపుల రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ముడుపులు కలెక్ట్ చేయడం దోచుకుని ఢిల్లీకి పంపించడమే రేవంత్ రెడ్డి ఏకైక పని ఆరోపించారు. L&T కంపెనీని ముడుపుల కోసం రేవంత్ వేధించినందుకే వాళ్ళు హైదరాబాద్ మెట్రో వదిలేసి వెళ్ళిపోతాం అంటున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని తమ కార్యకలాపాల నుంచి ఎల్ అండ్ టీ తప్పుకుంటుందని చెప్పారు. వాళ్లని వీళ్ళని జైల్లో పెడతా అంటే ఇలాంటి దుర్మార్గమైన ఫలితాలు వస్తాయనున్నారు. గతంలో అనేక కంపెనీలపై ఉన్న కేసులను ముందుపెట్టి ఆయా కంపెనీలతో రేవంత్ సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడని హాట్ కామెంట్స్ చేశారు.









