Wednesday 14th May 2025
12:07:03 PM
Home > తాజా > ‘పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నమా?’: కేటీఆర్!

‘పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నమా?’: కేటీఆర్!

ktr

KTR Fires On Congress Government | బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) ఇంటికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ (Arikepudi Gandhi) వెళ్లడం పెను దుమారానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

కౌశిక్ రెడ్డిపై దాడి జరిగిందని చెప్పిన ఆయన ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నమా? ఎటు పోతోంది మన రాష్ట్రం? అని ప్రశ్నించారు. ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోందన్నారు.

కౌశిక్ రెడ్డిని గృహనిర్బంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గుండాలతో దాడి చేయిస్తారా? అని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేకపోవటమేనా? అని అడిగారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాడుతున్నందునే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారని తెలిపారు.

ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఉడుత ఊపుల దాడులకు బెదరమని, ఇంతకు మించిన ప్రతిఘటన తప్పదంటూ కేటీఆర్ హెచ్చరించారు.

You may also like
“Operation Keller”..సైన్యం సంచలన ప్రకటన
‘భారత బలం-సంయమనం రెండింటినీ చూశాం’
ఆదంపూర్ ఎయిర్ బేస్ లో ప్రధాని
మృణాల్ ఠాకూర్ తో పెళ్లి..స్పందించిన నటుడు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions