KTR Fires On Cong Govt. Over Paddy Procurement | కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీఆరెస్ ( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం కొన్నది 46 లక్షల మెట్రిక్ టన్నులే అన్నారు.
రైతుభరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15 వేల కోట్లకు గాను గత వానాకాలం, యాసంగి కలిపి ఎగ్గొట్టింది రూ.26 వేల కోట్లు అని నిలదీశారు. క్వింటాలుకు రూ.500 బోనస్ అని రైతులలో ఆశలు రేపి దొడ్డు వడ్లకు తెడ్డు చూపి, సన్న వడ్లకు సవాలక్ష కొర్రీలు పెట్టి విదిలించింది కేవలం రూ.530 కోట్లే అని మండిపడ్డారు.
అసలు రైతుకే భరోసా లేదు ఇక కౌలు రైతులు, రైతుకూలీల ఊసెక్కడిదన్నారు. కల్లాల వద్దకే కొనుగోళ్లతో కేసీఆర్ ప్రభుత్వంలో రైతుకు భరోసా కానీ కల్లోల కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లు లేక రైతన్నల ఆందోళన చెందుతున్నారని ధ్వజమెత్తారు.
మొత్తంగా కొన్నది కాకరకాయ కొసిరింది గుమ్మడికాయ అన్నట్లుగా రేవంత్ సర్కారు పాలన ఉన్నదని కేటీఆర్ ఎద్దేవాచేశారు.