KTR congratulates ‘Balagam’ movie team on National Award win | 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం శుక్రవారం ప్రకటించిన విషయం తెల్సిందే.
బెస్ట్ లిరిక్స్ విభాగంలో ‘బలగం’ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాట జాతీయ అవార్డును దక్కించుకుంది. ఈ నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
బలగం సినిమాలోని పాటకు గాను జాతీయ అవార్డు సాధించిన ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్‌కు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌కు, బలగం టీమ్‌కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణలోని పల్లెవాసనకు పట్టం కట్టి ఆ పరిమళాలను విశ్వవ్యాప్తంగా వెదజల్లిన బలగం సినిమాకు నేషనల్ అవార్డ్ దక్కడం నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణం అని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.
దూరమవుతున్న మానవ సంబంధాలను తట్టిలేపిన గొప్ప సినిమాలోని ‘ఊరు – పల్లెటూరు’ పాట కుటుంబాలను ఏకం చేయడమే కాదు మూడు తరాలను దగ్గర చేసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో “బలగం”లోని ప్రతి ఒక్క సభ్యునికి కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు.









