KTR About Krishna River Water | నది జలాలను ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) తన్నుకు పోతున్నా రేవంత్ సర్కారు నోరెత్తడం లేదని మండిపడ్డారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కాంగ్రెస్ చోద్యం చూస్తుంటే..ఏపీ ఇష్టారాజ్యంగా యథేచ్చగా కృష్ణా జలాల తరలిస్తుందన్నారు. కృష్ణా జలాల నుండి ఏపీ ఇప్పటికే 646 టీఎంసీ ( TMC )లు వినియోగించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాగర్ కుడి కాలువ ద్వారా గత మూడునెలలుగా రోజుకు 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో జలాల తరలింపు జరుగుతుందన్నారు.
అయినప్పటికీ కాంగ్రెస్ సర్కార్ నిలువరిండంలేదని దుమ్మెత్తిపోశారు. కృష్ణా,గోదావరి నదుల్లో బొట్టును బొట్టును కాపాడుతూ బీడు భూములను కేసీఆర్ సస్యశ్యామలం చేస్తే, ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంటపొలాలను ఎండబెట్టిందని దుయ్యబట్టారు.
నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కోసం ఏర్పడ్డ రాష్ట్రంలో-ఒక్కొక్కొటిగా అన్నింటిని కాంగ్రెస్ గంగలో కలుపుతుందని విమర్శించారు. వచ్చే వేసవిలో తాగునీళ్లకు, సాగు నీళ్లకు కష్టమని కానీ గాలిమోటర్లో ఢిల్లీ ట్రిప్పులు కొడ్తున్న ముఖ్యమంత్రికి అన్నదాతల గోస ఏం తెలుసని కేటీఆర్ మండిపడ్డారు.
కేఆర్ఎంబి పరిధిలోని త్రీ మెన్ కమిటీ ( Three Men Committee ) దిక్కులేదు-సాగర్,శ్రీశైలం లో నీళ్లు అడుగంటి పొలాలు ఎండుతున్నా నీమ్మకు నీరెత్తినట్టున్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు.