KTR About Kalthi Kallu Incident | కూకట్పల్లి పరిధిలో కల్తీ కల్లు తాగి 40 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
హైదరాబాద్ లో కల్తీ కల్లు బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను వెంటనే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని సూచించారు. ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. కుటుంబం కోసం కాయకష్టం చేసే కష్టజీవులు కల్తీ కల్లు బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
ఇంతమంది చనిపోతే ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకాపోవడం చాలా దారుణమని విమర్శించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.