Tuesday 22nd April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కొత్త రాజకీయ పార్టీపై విశాల్ కీలక వ్యాఖ్యలు!

కొత్త రాజకీయ పార్టీపై విశాల్ కీలక వ్యాఖ్యలు!

actor vishal

Actor Vishal Comments | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. కాగా విజయ బాటలోనే మరో స్టార్ హీరో విశాల్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారంటూ, కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నారు అని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ సందర్భంగా జరుగుతున్న ప్రచారం పై స్పందించారు హీరో విశాల్. ఈ మేరకు ఒక బహిరంగ లేఖను విడుదల చేసారు. సమాజంలో ఒక నటుడిగా, సామాజిక సేవలో ప్రజల్లో ఒకరిగా హోదా, గుర్తింపు ఇచ్చిన తమిళ ప్రజలకు ఎప్పటికి రుణపడి ఉంటానని తెలిపారు విశాల్.

ప్రజల అభ్యున్నతి కోసం తల్లి ‘ దేవి ఫౌండేషన్’ పేరిట ఎంతోమంది పేదలకు సేవ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట విద్యార్థులకు కూడా సాయం చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ రాజకీయ లాభాలను ఆశించి తానెప్పుడూ ప్రజలకు సహాయం చేయలేదని స్పష్టం చేశారు ఈ కోలీవుడ్ హీరో.

ప్రస్తుతానికి మాత్రం ఈ ప్రజా సేవను కొనసాగిస్తానని, భవిష్యత్ లో ప్రకృతి మరేదైనా నిర్ణయం తీసుకుంటే ప్రజల పక్షాన, ప్రజల్లో ఒకడిగా, వారికోసం పోరాటం చేయడానికి సంకోచించనని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు విశాల్.

You may also like
చైనా లో ‘గోల్డ్ ఏటీఎం’..30 నిమిషాల్లో బ్యాంకులోకి నగదు
‘నన్ను మోసం చేశాడు..పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పదేళ్ల బాలుడు’
‘జమ్మూలో పర్యాటకులపై ఉగ్రదాడి’
‘రూ.2.5 కోట్లు మనీ లాండరింగ్..మహేష్ బాబుకు ఈడీ నోటీసులు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions