Kolikapudi Meets Peddireddy | మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో టీడీపీ నాయకులు, తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు సంభాషించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో తనయుడితో ములాఖత్ అయ్యేందుకు పెద్దిరెడ్డి బుధవారం రాజమండ్రికి వెళ్లారు.
ఈ సందర్భంగా విమానాశ్రయంలో పెద్దిరెడ్డిని కొలికపూడి కలిశారు. ఆయనతో కాసేపు మంతనాలు జరిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.










