Kodali Nani News | ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకులు కొడాలి నానికి గుండెపోటు వచ్చినట్లు బుధవారం ఉదయం నుండి మీడియాలో ప్రచారం జరిగింది.
గుండెపోటు రావడంతో ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని కుటుంబ సభ్యులు స్పందించారు. కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్య తో ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారని ఆయన క్షేమంగా ఉన్నట్లు టీం వెల్లడించింది.
మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరింది. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రిలో చేరిన కొడాలి నానికి వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుంది.









