KKR vs SRH Match Preview | ఐపీఎల్ 2025లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కత్త నైట్ రైడర్స్ తో తలపడనుంది.
గత సీజన్ లో ఫైనల్స్ లో కోల్కత్త చేతిలో హైదరాబాద్ ఘోర పరభావాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో గురువారం జరగబోయే మ్యాచులో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది.
తొలి మ్యాచులో 286 పరుగులు చేసి అద్భుతంగా సీజన్ ను స్టార్ట్ చేసిన హైదరాబాద్ తర్వాతి రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శన కనబరిచింది. అయినప్పటికీ 160-170 పరుగులు చేసే టీం మనది కాదు, అగ్రెస్సివ్ గా ఆడాలని కెప్టెన్ పాట్ కమిన్స్ చెప్పడం మాత్రం వైరల్ గా మారింది.
మరోవైపు గత సీజన్ లో ఛాంపియన్స్ గా నిలిచిన కోల్కత్త మెగా ఆక్షన్ కంటే ముందు శ్రేయస్ అయ్యర్, స్టార్క్ వంటి కీలక ఆటగాళ్లను మరియు గౌతమ్ గంభీర్ వంటి కోచ్ దూరం కావడంతో అనుకున్న రీతిలో ప్రదర్శన చేయలేకపోతుంది. ఈ నేపథ్యంలో విజయం కోసం రెండు జట్లు ఎదురుచూస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం జరగబోయే మ్యాచ్ రసవత్తరంగా మారడం ఖాయం. ఇకపోతే గత సీజన్ లో కోల్కత్త తో తలపడిన మూడు సార్లు హైదరాబాద్ ఓడింది. ఈ క్రమంలో కేకేఆర్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
అలాగే ఎప్పటినుండో ఊరిస్తున్న 300+ పరుగులను హైదరాబాద్ చేరుకుంటుందని మరికొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎస్ఆర్హెచ్ ను ఓడించి తిరిగి పుంజుకోవాలని కోల్కత్త చూస్తోంది.