Kharge, Rahul Gandhi urge Modi to legislate for restoration of J&K’s statehood | జమ్మూ కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బుధవారం సంయుక్తంగా లేఖ రాశారు.
ఈ లేఖలో, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చట్టం తీసుకురావాలని కోరారు. అలాగే, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.
2019లో ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన విషయం తెల్సిందే. అయితే గత ఐదేళ్లుగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు పూర్తి రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేస్తున్నారని, ఈ అభ్యర్థన న్యాయసమ్మతమైనదని, రాజ్యాంగం, ప్రజాస్వామ్య హక్కులకు అనుగుణంగా ఉందని రాహుల్, ఖర్గే లేఖలో పేర్కొన్నారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఆ వాగ్దానం అమలు కాలేదని విమర్శించారు. ఈ అంశాన్ని లేవనెత్తినందుకు రాహుల్, ఖర్గేలకు కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.