Kerala Influencer Arrest | కేరళ (Kerala) కోజికోడ్ లో బస్సులో ఓ వ్యక్తి తనను అసభ్యకరంగా తాకాడని ఆరోపిస్తూ ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఆ వీడియో వైరల్ కావడంతో దీపక్ అనే ఆ వ్యక్తి మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువతిని ఇన్‌ఫ్లుయెన్సర్ షింజితా ముస్తఫాగా గుర్తించిన పోలీసులు ఆమెపై ఆత్మహత్యకు పురిగొల్పిందనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు.
తాజాగా గురువారం ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న కేరళ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని నార్త్ జోన్ డీజీపీకి ఆదేశాలు చేసింది.









