KCR Responds on Kavitha Arrest | ఢిల్లీ మద్యం పాలసీ (Delhi Liquor Policy) కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్ట్ పై తొలిసారి స్పందించారు మాజీ సీఎం, బీఆరెస్ అధినేత కేసీఆర్ (KCR).
ఈ మేరకు గురువారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన బీఆరెస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఉత్తదేనని కొట్టిపారేశారు. కవిత అరెస్ట్ అక్రమమనీ, కక్ష పూరితంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.
గతంలో బీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయడానికి తాము పోలీసులను పంపించామని, అప్పటి నుండి ప్రధాని మోదీ తమపై కక్ష కట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్.
ఇందులో భాగంగానే కవితను అరెస్ట్ చేసి జైలుకు పంపారని పేర్కొన్నారు. లిక్కర్ కేసులో కవిత తప్పు చేసినట్లు రూ.100 కూడా చూపేట్టలేదన్నారు. కుట్ర పూరితంగా కవితను ఈ కేసులో ఇరికించారని కేసీఆర్ ఆరోపించారు.