Wednesday 23rd April 2025
12:07:03 PM
Home > తాజా > హలో కులకర్ణి.. ఆరోగ్యం ఎట్లుంది? కార్యకర్తకు కేసీఆర్ పరామర్శ!

హలో కులకర్ణి.. ఆరోగ్యం ఎట్లుంది? కార్యకర్తకు కేసీఆర్ పరామర్శ!

kcr

KCR Phone Call To BRS Follower | ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కు గురై హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బీఆరెస్ పార్టీ కార్యకర్తను ఆ పార్టీ అధినేత కేసీఆర్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న ధరణి కులకర్ణిని కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ దవాఖానకు వెళ్లి పరామర్శించారు. డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ కులకర్ణితో ఫోన్లో మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉంది అని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఏం బాధపడవొద్దని, ధైర్యంగా ఉండాలన్నారు. చికిత్స ఖర్చులను స్వయంగా తానే భరిస్తానని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కాగా మాజీ సీఎం కేసీఆరే ఫోన్ చేయడంతో కులకర్ణి మరియు ఆయన కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

You may also like
చైనా లో ‘గోల్డ్ ఏటీఎం’..30 నిమిషాల్లో బ్యాంకులోకి నగదు
‘నన్ను మోసం చేశాడు..పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పదేళ్ల బాలుడు’
‘జమ్మూలో పర్యాటకులపై ఉగ్రదాడి’
‘రూ.2.5 కోట్లు మనీ లాండరింగ్..మహేష్ బాబుకు ఈడీ నోటీసులు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions