Saturday 26th April 2025
12:07:03 PM
Home > తాజా > రంగంలోకి గులాబీ బాస్.. కేసీఆర్ అధ్యక్షతన బీఆరెస్ కీలక భేటీ!

రంగంలోకి గులాబీ బాస్.. కేసీఆర్ అధ్యక్షతన బీఆరెస్ కీలక భేటీ!

kcr

KCR Meeting With BRS MPs | మాజీ సీఎం, బీఆరెస్ సుప్రిమో కేసీఆర్ (KCR) అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ రణరంగంలోకి దిగుతున్నారు. కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం బీఆరెస్ పార్లమెంటరీ భేటీ జరగనుంది.

ఎర్రవెల్లి లోని ఫార్మ్ హౌస్ లో జరగనున్న ఈ భేటీకి రాజ్యసభ ఎంపీలకు, పార్లమెంట్ ఎంపీలకు ఇప్పటికే సమాచారం వెళ్ళింది. మాజీ మంత్రులు కేటీఆర్ మరియు హరీష్ రావులు కూడా ఈ భేటీకి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్న తరుణంలో నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. అలాగే జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

కాగా చాలా రోజుల అనంతరం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  అంతేకాకుండా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థుల పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే  బోయినపల్లి వినోద్, సిట్టింగ్ ఎంపీలు రంజిత్ రెడ్డి, నామా నాగేశ్వరరావు లకు దాదాపు సీటు ఖరారు కాగా మిగిలిన స్థానాలకు ఎవరిని ఎంపిక చేయనున్నారో అనేది చర్చనీయాంశంగా మారింది.

You may also like
smitha sabharwal
‘వాళ్లందరికీ నోటీసులు పంపారా..’ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్!
‘MMTS అత్యాచారయత్నం కేసు..యువతి మాటలకు షాకయిన పోలీసులు’
nithin
‘అక్కడ 3 రోజులు ఉంటే జబ్బులు ఖాయం’
indiramma indlu
ఇందిరమ్మ ఇండ్లపై తొలి అడుగు.. ఖాతాల్లో రూ. లక్ష జమ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions