Wednesday 14th May 2025
12:07:03 PM
Home > తెలంగాణ > మత పిచ్చి లేపే బీజేపీని చెత్త కుప్పలో పారేయ్యాలి..కేసీఆర్!

మత పిచ్చి లేపే బీజేపీని చెత్త కుప్పలో పారేయ్యాలి..కేసీఆర్!

kcr news

KCR Fires On Modi| బీఆరెస్ ( BRS ) అధినేత కేసీఆర్ ( KCR ) బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలపై ధ్వజమెత్తారు. గురువారం ఆదిలాబాద్ బీఆరెస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ( Congress ) మరియు బీజేపీ ( BJP ) లు ఒకే నాణానికి రెండు వైపులు అంటూ విమర్శలు గుప్పించారు.

10 ఏండ్ల బీజేపీ పాలనలో తెలంగాణ కు ఒక్క మెడికల్( Medical ) కాలేజీ ఇవ్వలేదని, ఒక్క నవోదయ పాఠశాలలు కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు గులాబీ బాస్.

ప్రధాని మోది ( Modi )కి 100 లేఖలు రాసినా ఒక్క మెడికల్ ( Medical ) కాలేజి కూడా ఇవ్వలేదని, తెలంగాణ భారత దేశంలో అంతర్భాగం కదా? ఎందుకు ఈ వివక్ష అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. మనకు అన్యాయం చేసిన బీజేపీ కి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.

మత పిచ్చి లేపే బీజేపీ ని చెత్త కుప్పలో పారేయ్యాలి, బీజేపీ కి ఒక్క ఓటు వేసినా అది మోరిలో వేసినట్లే అంటూ నిప్పులుచేరిగారు కేసీఆర్. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కి మెజారిటీ ( Majority ) రాదని ఏర్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అంటూ జోస్యం చెప్పారు.

అప్పుడు ప్రాంతీయ పార్టీలే కీలక భూమిక పోషిస్తాయని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్.

You may also like
cm revanth reddy
కేసీఆర్ ప్రసంగంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే!
ముఖ్యమంత్రిగా ఇదే నా బ్రాండ్: సీఎం రేవంత్
షెడ్యూల్ రద్దు చేసుకుని..హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి
‘బీజేపీకి వచ్చే అధ్యక్షుడు సీఎంతో సీక్రెట్ గా కలవద్దు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions