KCR Hold BRSLP Meeting With MLAs and MLCs | మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బుధవారం నుండి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ అయ్యారు. మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన బీఆరెస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు.
మూడు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. తాను కూడా శాసనసభ సమావేశాలకు వస్తున్నట్లు పార్టీ ప్రతినిధులకు కేసీఆర్ స్పష్టం చేశారు.









