KBK Hospital’s Health Camp | అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఆంప్యుటేషన్ ( Amputation ) చేయకుండా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న కేబీకే హాస్పిటల్ ( KBK HOSPITAL ) మంగళవారం హైదరాబాద్ లో మరో హెల్త్ క్యాంప్ నిర్వహించింది.
నగరంలోని మల్కాజ్ గిరిలోని ఇందిరా నెహ్రూ నగర్ హిల్ చర్చ్ ( Hill Church ) ప్రాంగణంలో కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ బక్క ఎలియా ( Bakka Eliah ), హాండ్స్ ఆఫ్ మెర్సీ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
ఆర్గనైజర్ బొల్లం సునీల్ ఆధ్వర్యంలో ఈ హెల్త్ క్యాంప్ నకు దాదాపు 300 మంది స్థానికులు హాజరయ్యారు. వీరందరికి కేబీకే హాస్పిటల్ వైద్యులు తగిన వైద్య పరీక్షలు నిర్వహించి మందులను సూచించారు.
ఈ సందర్భంగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ( National Christian Council ) వైస్ ప్రెసిడెంట్ బక్క ఎలియా మాట్లాడుతూ నెహ్రూ నగర్ లోని నిరుపేదల కోసం ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ హెల్త్ క్యాంప్ నకు నెహ్రూ నగర్ స్థానికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందనీ, సుమారు 300 మందికి పైగా ఈ హెల్త్ క్యాంప్ నకు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారని వివరించారు.
పేదల కోసం భవిష్యత్తులోనూ మరిన్ని హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని బక్క ఎలియా తెలిపారు. ఈ వైద్య శిబిరానికి సహకరించిన కేబీకే హాస్పిటల్ వైద్యులకు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.