KCK Birthday In KBK Hospital | కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 69వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
హయత్ నగర్ లోని ఆసుపత్రి ప్రాంగణంలో KBK Hospitals వ్యవస్థాపకులు డాక్టర్ కక్కిరేణి భరత్ కుమార్.. (Kakkireni Bharath Kumar) కేసీఆర్ పుట్టిన రోజు (KCR Birthday )కేక్ ను కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం సుమారు 1000 మందికి పైగా అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ భరత్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాగే ఆయురారోగ్యాలతో రాష్ట్ర అభివృద్ధిని మరింత పరుగులు పెట్టించాలని అభిలషించారు.
కేబీకే హాస్పిటల్ లో గ్యాంగ్రీన్ (Gangrene), డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ (Foot Ulcer), సెల్యులైటిస్, కాలిన గాయాలు, రోడ్డు ప్రమాద గాయాలు, దీర్ఘకాలిక పుండ్లకు అత్యాధునిక చికిత్స అందిస్తున్నట్లు భరత్ కుమార్ వివరించారు.
Read Also: మానసిక విజ్ఞానం.. ఆర్థిక క్రమశిక్షణ విజయానికి సోపానాలు: Dr. KBK
షుగర్ లేదా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఏర్పడ్డ దీర్ఘకాలిక పుండ్లకు కాళ్లు, చేతులు లేదా ఇతర శరీర భాగాలను తొలగించాల్సిన అవసరం లేకుండా కేబీకే హాస్పిటల్ లో మాత్రమే లభించే ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేబీకే హాస్పిటల్ రూపొందించిన కేబీకే సంపూర్ణ ఆరోగ్య కార్డు (KBK Hospital Health Card) ను ఉచితంగా పంపిణీ చేశారు భరత్ కుమార్.
ఈ కార్డు ద్వారా కుటుంబంలో ఎవరైనా కేబీకే హాస్పిటల్ (KBK Hospital)లో చికిత్స చేయించుకోవచ్చని తెలిపారు.
కార్డు ఉన్న వారికి ఓపీ, ఐపీ, వైద్య పరీక్షలు, మెడిసిన్ బిల్లులో పెద్ద మొత్తంలో డిస్కౌంట్ పొందవచ్చని వివరించారు. కార్డు కోసం ఏ సమయంలోనైనా హాస్పిటల్ సందర్శించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో హయత్ నగర్ మాజీ కార్పొరేటర్, సామ తిరుమల్ రెడ్డి, టీఆరెఎస్ నాయకులు కష్ణా రెడ్డి, ఇతర నేతలు, కేబీకే హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.