Visionary Leader Award For KBK | విభిన్న రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థ కేబీకే గ్రూప్ (KBK Group) చైర్మన్ డా. భరత్ కుమార్ కక్కిరేణి (Bharath Kumar Kakkireni)కి మరో గౌరవం దక్కింది.
ఇటీవల హైదరాబాద్ లోని హైటెక్స్ లోని నిర్వహించిన ఇండియా రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్స్ పో సందర్భంగా నిర్వహించిన బిజినెస్ ఎమినెన్స్ అవార్డ్స్ (Business Eminence Awards)లో భరత్ కుమార్ కు వ్యాపార నిర్వహణలో విజనరీ లీడర్ పురస్కారం దక్కింది.
డిసెంబర్ 28న నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేబీకే గ్రూప్ చైర్మన్ డా. భరత్ కుమార్ తరఫున సంస్థ ప్రతినిధి ప్రమోద్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా విభిన్న రంగాల్లో సేవలు అందిస్తున్న కేబీకే సంస్థ పనితీరును నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు.
డిజిటల్ మార్కెటింగ్ సేవలు..
కేబీకే గ్రూప్ చైర్మన్ డా. భరత్ కుమార్ కక్కిరేణి తన సంస్థలోని విభిన్న కంపెనీల ద్వారా వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా కేబీకే బిజినెస్ సోల్యూషన్స్ (KBK Business Solutions) ద్వారా ఐటీ, డిజిటల్ మార్కెటింగ్ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు.
అమెరికా కేంద్రంగా పనిచేసే ఈక్వినాక్స్ ఐటీ సొల్యూషన్స్ (Equinox IT Solutions) ద్వారా ఐటీ సర్వీసులతోపాటు యూఎస్ లో ఎంఎస్ పూర్తి చేసిన భారతీయ విద్యార్థులకు ఉద్యోగాల కల్పనలో విశేష సేవలు అందిస్తున్నారు.
కేబీకే హాస్పిటల్ ద్వారా గ్యాంగ్రీన్, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్, సెల్యూలైటిస్ లాంటి పలు దీర్ఘకాలిక సమస్యలకు ఆంప్యుటేషన్ అవసరంలేని అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు.
