KBK Group Blood Donation Camp | చిన్నారి భవిశ్రీ క్షితిజ జన్మదినం సందర్భంగా కార్యక్రమం
డిజిటల్ మార్కెటింగ్, హాస్పిటల్, ఐటీ రిక్రూట్ మెంట్ తదితర రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న కేబీకే గ్రూప్ సీఈవో డా. కక్కిరేణి భరత్ కుమార్ జయ వైష్ణవి కుమార్తె భవిశ్రీ క్షితిజ జన్మదినం సందర్భంగా బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఉప్పల్ లోని కేబీకే గ్రూప్ కేంద్ర కార్యాలయంలో తలసేమియా అండ్ సికిల్ సొసైటీ నేతృత్వం తలసేమియా బాధిత చిన్నారుల సహయార్థం ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో కేబీకే గ్రూప్ సంస్థ సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు.
తద్వారా అనేక మంది తలసేమియా బాధిత చిన్నారుల ప్రాణాలను కాపాడటంలో భాగమయ్యారు. ఈ సందర్భంగా కేబీకే గ్రూప్ ప్రతినిధులు మాట్లాడుతూ తరచూ రక్తమార్పిడి అవసరం ఉన్న తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఏటా ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కేబీకే గ్రూప్ ప్రతినిధులు, ఉద్యోగులు, సికిల్ సెల్ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.











