Kavitha Kalvakuntla News | తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు సినిమాల్లో తెలంగాణ యాసను అవహేళన చేసేవారని పేర్కొన్నారు బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత.
తెలంగాణ ఉద్యమ సమయంలో నంది అవార్డులు ఇస్తున్నప్పుడు తెలంగాణ యాసను అవహేళన చేసిన ఒక క్యారెక్టర్‌కు నంది అవార్డు ఇస్తున్నరని నిరసన తెలిపిన ఒకే ఒక సంస్థ తెలంగాణ జాగృతి అని ఆమె తెలిపారు.
సినిమాలు తీసి..సినిమాల్లో వచ్చే డబ్బులను తెలంగాణలోనే ఖర్చు పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నరనే నేపథ్యంలో ఆంధ్ర సినిమాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చింది కూడా తెలంగాణ జాగృతే అని కవిత చెప్పారు.
ఈ మేరకు శనివారం మేడ్చెల్ జిల్లాలోని కొంపల్లిలో ‘లీడర్’ అనే పేరుతో నిర్వహించిన రాజకీయ శిక్షణా తరగతుల కార్యక్రమంలో కవిత పాల్గొని ప్రసంగించారు. 19 ఏండ్ల తెలంగాణ జాగృతి ప్రస్థానంలో తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసిందని వ్యాఖ్యానించారు.








