Saturday 21st September 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తిరుమల లడ్డూ వివాదం..కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

తిరుమల లడ్డూ వివాదం..కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

Karnataka Govt. On Tirupathi Laddu Issue | ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో లడ్డూ నాణ్యతపై నెలకొన్న వివాదం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది.

శ్రీవారి లడ్డూలో నాణ్యత ప్రమాణాలను తగ్గించి జంతువుల కొవ్వును వాడారని గత వైసీపీ ( YCP ) ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం చంద్రబాబు ( Cm Chandrababu ). ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలో కర్ణాటక ( Karnataka )రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ధూప, దీప, నైవేథ్యం మరియు ప్రసాదాల తయారీకి కేవలం నందిని నెయ్యి ( Nandini Ghee )ని మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కర్ణాటకలోని సుమారు 34 వేల ఆలయాల్లో నందిని నెయ్యిని మాత్రమే వాడాలని రిలీజియస్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఆలయాల్లో తయారు చేసే ప్రసాదంలో ఎటువంటి నాణ్యత లోపం ఉండకూడదని సూచించింది.

You may also like
లడ్డూ వివాదం..టీటీడీకి తెలంగాణ విజయ డెయిరీ ఆఫర్
శ్రీవారి లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ వివాదం..పవన్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions