Harirama Jogaiah Letter | మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య (Harirama Jogaiah) శుక్రవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా పవన్ కు కీలక ప్రశ్నలు సంధించారు.
లోకేశ్ బాబు (Nara Lokesh) ఆశిస్తున్నట్లు పూర్తి కాలం చంద్రబాబే (Chandra Babu) ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకుంటున్నారా? దానికి మీ ఆమోదం ఉందా? అంటూ ఆయన పవన్ ని ప్రశ్నించారు.
మీరే సీఎం కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీనవర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలి అని కలలు కంటున్న జనసైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నారు? అంటూ హరిరామ జోగయ్య లేఖలో పవన్ ని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి రెండే కులాల నాయకులు రాజ్యమేలుతున్నారు. 80 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం కలిగేదెప్పుడు? అని ప్రశ్నించారు.
”మీరు పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకొక దారి చూపిస్తారని, నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఎదురు చూస్తున్న ప్రజానీకానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? అంటూ అడిగారు.
నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా మీ నుంచి జన సైనికులకు సంతృప్తికరమైన సమాధానాలను ఆశిస్తూ రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జన సైనికులందరకీ అర్థమయ్యేలే చెప్పాల్సిందిగా కోరుతున్నాం అంటూ తన లేఖలో పేర్కొన్నారు.
