Kamala Harris Ancestral Village | అమెరికా ( USA ) అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారీస్ ( Kamala Harris ) గెలవాలని తమిళనాడులోని ఓ గ్రామంలో పూజలు నిర్వహిస్తున్నారు. కమలా హ్యారీస్ తల్లి తమిళనాడు ( Tamilnadu ) రాష్ట్రానికి చెందినవారు అనే విషయం తెల్సిందే.
భారత సంతతికి చెందిన కమలా విజయం సాధించాలని ఆమె పూర్వీకుల గ్రామం అయిన తులసేంద్రపురం లోని ఆలయంలో గ్రామస్థులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. కమలా హ్యారీస్ తాతయ్య పీవీ గోపాలన్ ( PV Gopalan ). ఆయనది తులసేంద్రపురం. సివిల్ సర్వెంట్ అయిన గోపాలన్ పదవీ విరమణ తీసుకొని చెన్నై ( Chennai ) లో సెటిల్ అయ్యారు.
చిన్నతనంలో కమలా హ్యారీస్ తల్లి శ్యామలతో కలిసి భారత్ కు పలుసార్లు వచ్చినట్లు ఆయన గతంలోనే చెప్పారు. 2020 అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ ( Joe Biden ) ప్రెసిడెంట్ గా గెలవడంతో కమలా హ్యారీస్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.
ఈ సమయంలో కూడా తులసేంద్రపురం గ్రామంలోని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు ఆమె అధ్యక్ష పోరులో ఉండడంతో ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ కమలా విజయం సాధిస్తే అమెరికా చరిత్రలో ప్రెసిడెంట్ అయిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టిస్తారు.