Kamal Haasan meets friend Rajinikanth ahead of Rajya Sabha oath-taking ceremony | అగ్ర కథానాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిశారు. తమిళనాడు నుంచి ఇటీవలే కమల్ హాసన్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే.
ఈ క్రమంలో జులై 25న ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ రజినీని కలిసి రాజ్యసభకు వెళ్తుండడంపై ఆనందాన్ని పంచుకున్నారు. నూతన ప్రయాణం మొదలుపెట్టేముందు స్నేహితుడు రజినీకాంత్ తో ఆనందం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కమల్ హాసన్ పోస్టు చేశారు.
కాగా ఈ ఇద్దరు అగ్ర కథానాయకులు దశాబ్దాల పాటు తమిళ చిత్ర పరిశ్రమను శాసించారు. వీరి మధ్య ఇప్పటికీ స్నేహ సంబంధాలు కొనసాగుతుండడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.









