Thursday 24th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > టీడీపీ జనసేన కూటమిలో118 సీట్లు ఖరారు.. జనసేనకు ఎన్నంటే!

టీడీపీ జనసేన కూటమిలో118 సీట్లు ఖరారు.. జనసేనకు ఎన్నంటే!

tdp janasena

TDP – Janasena First List | సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్ర ప్రదేశ్ లోని టీడీపీ జనసేన కూటమి (TDP-Janasena) తొలి జాబితా విడుదలైంది. మొత్తం 175 స్థానాలకు గానూ 118 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారు.

ఉండవల్లిలోని టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసం లో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్, బాబు కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 118 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి 94, జనసేనకు 24 సీట్లు ఫిక్స్ అయ్యాయి.

జనసేనకు మూడు పార్లమెంట్ సీట్లను కూడా ఖరారు చేశారు. టీడీపీ 94 మంది పేర్లను ప్రకటించింగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐదుగురు అభ్యర్థులను ఖరారు చేశారు. తెలుగు దేశం పార్టీలోని ముఖ్య నేతలందరికీ మొదటి జాబితాలోనే టికెట్లు కన్ఫామ్ అయ్యాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుండి, నారా లోకేష్ మంగళగిరి నుండి, నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నుంచి, అచ్చెన్నాయుడు టెక్కలి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నారు.  

You may also like
indiramma indlu
ఇందిరమ్మ ఇండ్లపై తొలి అడుగు.. ఖాతాల్లో రూ. లక్ష జమ!
dr kavvampally satyanarayana
ఎమ్మెల్యే ఆన్ వీల్స్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం!
manchu vishnu
ఫ్యాన్స్ కి సారీ చెబుతూ మంచు విష్ణు పోస్ట్..!
Ram Charan
రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions