Jadcharla MLA Anirudh Reddy | జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ ఎస్కార్టును తిరస్కరించారు. ఈ మేరకు తనకు పోలీస్ ఎస్కార్ట్ వద్దంటూ మంగళవారం జిల్లా ఎస్పీకి లేఖ రాశారు.
నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా తాను ఎక్కడికి వెళ్లినా పోలీసు వాహనాలు ఎస్కార్ట్ వస్తున్నాయన్న ఆయన సామాన్య ప్రజలకు పోలీసుల సేవలు ఎంతో అవసరం ఉంటుదని అభిప్రాయపడ్డారు. తన వాహనం ముందు ఎస్కార్ట్ పోలీసులు కేటాయించే సమయాన్ని ప్రజల సమస్యలు పరిష్కరించడంలో, శాంతిభద్రతలు కల్పించడంలో వినియోగించాలని కోరారు.
పోలీస్ డిపార్ట్మెంట్లో డిమాండ్ కు తగ్గ సిబ్బంది లేనందున తన కోసం పోలీసులను, ఎస్కార్ట్ వాహనాలు వాడొద్దని కోరుతూ మంగళవారం జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే ఫార్మాట్ లో అనిరుద్ రెడ్డి లేఖ రాశారు. ఈ విషయం జడ్చర్ల నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.
కాగా జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే నిర్ణయాన్ని స్వాగతిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. కాగా ఎమ్మెల్యే నిర్ణయంపై జిల్లా ఎస్పీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.