Sunday 27th July 2025
12:07:03 PM
Home > తాజా > హైదరాబాద్ లో ఐటీ సోదాలు.. బీఆరెస్ అభ్యర్థి ఇంట్లో తనిఖీలు!

హైదరాబాద్ లో ఐటీ సోదాలు.. బీఆరెస్ అభ్యర్థి ఇంట్లో తనిఖీలు!

Pilot Rohit Reddy

IT Raids in Hyderabad | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) వేళ మరో అభ్యర్థిపై ఐటీ దాడులు జరిగాయి.

తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy) ఇంట్లో శనివారం ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

తాండూర్, హైదరాబాద్ మణికొండలోని రోహిత్ రెడ్డి ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

రోహిత్ రెడ్డి నుంచి రూ. 20 లక్షలు ఆయన తమ్ముడు రితీష్ రెడ్డి ఇంటినుంచి అధికారులు రూ. 24 లక్షలతో పాటుగా పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

దాదాపుగా 5 చోట్లలో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వ హిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లోని పాతబస్తీలో శనివారం తెల్లవారుజామునుంచే ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నా రు.

కోహినూర్ గ్రూప్స్ (Kohinoor Groups) ఎండీ మజీద్‌ఖాన్ ఇళ్లు, కార్యలయాల్లో ముమ్మరంగా తనిఖీలు జరుపుతున్నారు. కింగ్స్‌ గ్రూప్‌ ఓనర్‌ షానవాజ్ ఇంటితోపాటు పలువురు ఇళ్లలో సోదాలు నిర్వ హిస్తున్నా రు.

You may also like
maganti gopinath
బీఆరెస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత!
kavlakuntla kavitha news office
తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్ ప్రారంభించిన కవిత!
bandi sanjay
‘చార్ పత్తా ఆట..’ కవిత వ్యవహారంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్!
Mandipattu-Kishan Reddy on the government saying that it has written down the tradition of the legislative assembly
‘వాళ్ల అసలు రంగు బయటపడింది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions